World test championship : India leave out Hardik, Shaw for WTC Final, England Tests . here's the reason.
#HardikPandya
#Bhuvaneshwarkumar
#KuldeepYadav
#ViratKohli
#WTCFinal
#WorldTestChampionship
#IndvsNz
ఇంగ్లండ్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలం. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు తుది జట్టులో చోటు ఖాయమని అంతా భావించారు. ఎందుకంటే భారత జట్టులో ప్రస్తుతం ఉన్న ఏకైక సీమ్ ఆల్‌రౌండర్ అతనే. అయితే గత కొద్దిరోజులుగా బౌలర్‌గా కాకుండా పాండ్యా కేవలం బ్యాట్స్‌మన్‌గానే సేవలందిస్తున్నాడు. కనీసం టీ20 మ్యాచ్‌లోనూ అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఫిట్‌గా ఉంచేందుకే హార్దిక్ పాండ్యాతో ఎక్కువగా బౌలింగ్ చేయనీయడం లేదని కెప్టెన్ కోహ్లీ పదేపదే చెబుతూ వచ్చాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో మాత్రమే బౌలింగ్ చేసిన హార్దిక్ ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా వేయలేదు. అటు బ్యాట్స్‌మన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో టీమిండియా సెలెక్టర్ టెస్టు జట్టులో అతన్ని పక్కకు తప్పించారు.